శారదా పీఠాధిపతులను కలిసిన టీటీడీ ప్రతినిధులు

6 Sep, 2020 18:18 IST|Sakshi

స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలకు శ్రీవారి శేషవస్త్రం అందజేత

సాక్షి, తిరుపతి: రిషికేశ్‌లో విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను ఆదివారం టీటీడీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా స్వామీజీలకు శ్రీవారి శేష వస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, జేఈవో ధర్మారెడ్డికి స్వామీజీ ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా స్వామీజీలు చేపట్టిన చాతుర్మాస్య దీక్ష వివరాలను టీటీడీ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ధార్మిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. (చదవండి: కాగ్‌ ద్వారా టీటీడీ ఆడిటింగ్‌..!)

తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక అంశాలను కాగ్ పరిధిలోకి తీసుకొచ్చే యోచన ఆహ్వానించదగ్గ పరిణామమని స్వామి స్వరూపానందేంద్ర అభినందించారు. అలాగే గుడికో గోవు కార్యక్రమం చేపట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు  చెప్పారు. టీటీడీ ధార్మిక నిర్ణయాలపై సాంప్రదాయ గురువులను సంప్రదించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో భజన మండళ్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయాలను ముఖ్య నగరాలతో పాటు హరిజన, గిరిజన ప్రాంతాల్లోనూ నిర్మించాలని స్వరూపానందేంద్ర సూచించారు.

మరిన్ని వార్తలు