TTD Ban Plastic: టీటీడీ హెచ్చరిక.. వాటిని వినియోగిస్తే షాపులు సీజ్‌

3 Jun, 2022 11:01 IST|Sakshi

తిరుమలలో టీటీడీ అధికారుల ముమ్మర తనిఖీలు

సాక్షి,తిరుమల: తిరుమలలో దుకాణాలు, హోటళ్ల యజమానులు వీలైనంత త్వరగా ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇకపై తనిఖీల్లో హెచ్చరికలు ఉండవని, ఏకంగా షాప్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ప్లాస్టిక్‌ సంపూర్ణ నిషేధం అమలు చేసేందుకు టీటీడీ అధికారులు గురువారం ముమ్మర తనిఖీలు చేపట్టారు.

టీటీడీ రెవెన్యూ విభాగం, ఆరోగ్య శాఖ, నిఘా, భద్రతా విభాగం అధికారులు 10 బృందాలుగా ఏర్పడి తిరుమలలోని పలు ప్రాంతాల్లో దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ కవర్లతో కూడిన వస్తువులు, షాంపులు, బొమ్మలు, దుస్తులు విక్రయించకూడదని ఆదేశించారు.

చదవండి: కాకినాడ: యాచకుడి మృతి.. సంచుల నిండా నోట్లు చూసి మైండ్‌ బ్లాక్‌

మరిన్ని వార్తలు