శ్రీవారి దర్శనానికి 6 గంటలు

30 Jun, 2022 05:15 IST|Sakshi

తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు 77,154 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,182 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.62 కోట్లు వేశారు. ఎటువంటి టోకెన్‌లు లేకపోయినా శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. స్వామి వారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్‌లు నిండి ఉన్నాయి.

స్వామిని దర్శించుకున్న సినీ నటి రాశీ ఖన్నా
తిరుమల శ్రీవారిని బుధవారం సినీ నటి రాశీ ఖన్నా దర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలను, అధికారులు ప్రసాదాలను అందించారు.  

మరిన్ని వార్తలు