రెండు రోజులు వర్షాలు 

20 Apr, 2021 03:37 IST|Sakshi

మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే వీలుందని వెల్లడించారు. కాగా, సముద్రపు గాలుల వల్ల సోమవారం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నెల్లూరు, ప్రకాశం, విశాఖలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు