రాష్ట్రంలో రెండు రోజులు వానలు

28 Oct, 2020 04:28 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా బుధవారం నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. 

మరిన్ని వార్తలు