తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం

12 Aug, 2021 18:30 IST|Sakshi

తిరుమల: తిరుమలలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. భక్తులకు నకిలీ టికెట్లను అంటగడుతున్న దళారులు దందా గుట్టు రట్టు అయ్యింది. హైదరాబాద్‌ నుంచి వెళ్లిన భక్తులకు దళారులు మార్ఫింగ్ చేసిన రెండు రూ.300 టికెట్లను రూ.4,400కు విక్రయించారు. ప్రతిరోజూ కేటాయించిన రూ.300 దర్శనం కోటా టికెట్ల కంటే ఎక్కువ మంది రోజువారీగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నట్లు టీటీడీ, విజిలెన్స్ అధికారులు అనుమానం రావడంతో అధికారులు ఈ వ్యహరంపై నిఘా పటిష్ఠం చేశారు. అయితే, హైదరాబాద్‌ భక్తులు నేడు శ్రీవారి దర్శనానికి రావడటంతో ఈ మొత్తం వ్యవహరం వెలుగోలోకి వచ్చింది. మార్ఫింగ్‌ టికెట్ల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు