రెండేళ్ల వయసులోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో..

14 Nov, 2021 10:38 IST|Sakshi
జ్ఞాన్‌దేవ్‌ సాధించిన పతకం, సర్టిఫికెట్‌తో మురిసిపోతున్న అమ్మ, అమ్మమ్మ, తాత

సాక్షి, మధురవాడ (భీమిలి): కొందరు చిన్నప్పటినుంచే ప్రతిభ కనబరుస్తుంటారు. ఇటువంటివాళ్లను చూసి ఇది గాడ్‌ గిఫ్ట్‌ అంటాం. ఈ చిన్నారి విషయంలో మదర్‌ గిఫ్ట్‌ కూడా ఉంది. తన బిడ్డను తీర్చిదిద్దిన వైనం రికార్డులు తెచ్చిపెట్టింది. రెండేళ్ల వయసులోనే జ్ఞాన్‌దేవ్‌  ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. మధురవాడ శివశక్తినగర్‌కు చెందిన గంధం అమిత ప్రియ ఏకైక కుమారుడు జ్ఞాన్‌దేవ్‌. 


బాలుడు తల్లి అమిత ప్రియ గీతం యూనివర్సిటీలో ఎం.కామ్‌ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. తండ్రి మనోహర్, తల్లి ఈశ్వరి కుమారీల సంరక్షణలో ఉంటుంది.అమితప్రియ రెండేళ్ల కుమారుడు  జ్ఞాన్‌దేవ్‌కు 6 జాతీయ చిహ్నాలు , 12 రాశి ఫలాలు, 24 వాహనాలు, 13 రకాలు పండ్లు, 21 సంగీత పరికరాలు, 13 సముద్ర జీవ రాశులు, 10 చారిత్రక స్థలాలు, 10 స్టేషనరీ వస్తువులు, 10 కంప్యూటర్‌ విడిభాగాలు, 10 రకాల క్రీడల బంతులు, 8 ఇండియన్‌ సీఈవోలు,  5 ప్రార్థనా స్థలాలు, 6 మతాలు, 8 రకాల నీటి మొక్కల మూలాలు, 9 మంచి అలవాట్లు గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. అలాగే 15 రకాల చర్యలను నటన ద్వారా చూపించి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాందించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు.  

చదవండి:  (విశాఖ కోకిల.. వెండితెరపై వెలుగుతున్న వాగ్దేవి)  

మరిన్ని వార్తలు