2 Years YS Jagan Ane Nenu: సంక్షేమ సంతకం

28 May, 2021 15:49 IST|Sakshi

సంక్షేమ పథకాల్లో ఏపీ రికార్డు

రెండేళ్లలోనే 95 శాతం పథకాలు అమలు

సంక్షేమ పథకాలకు రూ. 1.25 లక్షల కోట్ల వ్యయం

సంక్షేమ పథకాల్లో నూతన ఒరవడి సృష్టించిన సీఎం జగన్‌

వెబ్‌డెస్క్‌: సంక్షేమ పథకాలు ప్రకటించడంలోనే కాదు వాటిని అమలు చేయడంలోనూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త పంథాను నెలకొల్పారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నూతన ఒరవడిని సృష్టించారు వైఎస్‌ జగన్‌. రెండేళ్లలోనే లెక్కకు మిక్కిలిగా ప్రజాసంక్షేమ పథకాలు ప్రారంభించారు. గత రెండేళ్లుగా ఎంతో సాహసంతో వాటిని అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారు.

సంక్షేమ క్యాలెండర్‌
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతీ సంక్షేమ పథకానికి సంబంధించి క్యాలెండర్‌ని ప్రకటించారు. అందులో ఏ పథకానికి ఎన్ని నిధులు ఏ తేదిన విడుదల అవుతాయనే వివరాలు ముందుగానే తెలియజేశారు. ఈ క్యాలెండర్‌ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ క్యాలెండర్‌ ప్రకారం రాబోయే జూన్‌లో జగనన్న తోడు తొలి విడత, వైఎస్సార్‌ వాహన మిత్ర రెండో విడత,  వైఎస్సార్‌ చేయూత మూడో విడత చెల్లింపులు చేయనుంది జగన్‌ ప్రభుత్వం. ప్రతీ మంగళవారం ఒక్కో పథకానికి నిధులు విడుదల చేయనుంది.

సంక్షేమానికి రూ. 1.25 లక్షల కోట్లు
రెండేళ్ల కాలంలో కనివినీ ఎరుగని రీతిలో 94.5 శాతం వాగ్ధానాలను పూర్తి చేసింది జగన్‌ ప్రభుత్వం. ఐదేళ్ల కాలంలో అమలు చేయాల్సిన పథకాలను రెండేళ్లలోనే ఆచరణలో పెట్టి రికార్డు సృష్టించారు జగన్‌. సంక్షేమ పథకాలకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 129 వాగ్ధానాలు చేయగా అందులో ఇప్పటికే 107 హామీలు అమల్లోకి వచ్చాయి. 24 నెలల కాలంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ. 93,708 కోట్ల రూపాయలు చేరగా... పరోక్షంగా మరో రూ. 31,714 కోట్లు అందించింది జగన్‌ సర్కార్‌. మొత్తంగా రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాలపై ఏకంగా రూ. 1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. 

తనపర బేధం లేదు
ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ సంక్షేమ పథకానికి ప్రతిపక్ష పార్టీ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నా.. ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది ఏపీ ప్రభుత్వం. కులం, మతం, ప్రాంతం, పార్టీ బేధాలు చూడకుండా అర్హుడైతే చాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న, రాబోయే తరానికి మంచి జరగాలనే లక్ష్యంతోనే సర్కారు ముందుకు వెళ్తోంది. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేసేందుకు 9,260 కొత్త వాహనాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. లబ్దిదారులకు నాణ్యమైన రేషన్‌ అందించడంలో భాగంగా అదనంగా రూ.830 కోట్లు వెచ్చించారు.

సొంతింటి కల సాకారం
సరైన పక్కా ఇళ్లు లేని వారు,  అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ‍్బందులు పడుత్ను పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ధృడ సంకల్పం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. గతంలో ఎన్నడూ కనివినీ ఎగురని రీతిలో ప్రభుత్వమే ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ ఖర్చులకు కూడా భరించాలని నిర్ణయించారు. మొత్తం 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా దాదాపు 28,54,983 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ పట్టాలన్నీ మహిళల పేరు మీదే జారీ చేశారు. శరవేగంగా ఇళ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. జూన్‌ 1 నుంచి 15.60 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా అంతా సిద్ధం చేయాలంటూ అధికారులకు సీఎం జగన్‌ టార్గెట్‌ ఇచ్చారు

కరోనా ఉన్నా..
ఏపీలో వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో 2019లో మే 30 ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ వెంటనే ఆరు నెలలకే కరోనా మహమ్మారి ప్రపంచంపై దాడి చేసింది. కోవిడ్‌​ ఎఫెక్ట్‌తో ఆర్థిక వ్యవస్థ ఒడిదుడులకు లోనైంది. ఆశించిన ఆదాయం రాలేదు. 24 నెలల పాలనలో 14 నెలలు పాటు కొవిడ్‌ ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఐనప్పటికీ ఏ ఒక్క సంక్షేమ పథకం నిధుల లేమితో నీరుగారి పోలేదు. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపుతూ ఏ ఒక్క పథకం అమలు వాయిదా పడలేదు. ఎన్నికల మెనిఫెస్టోలో ప్రజలకు వాగ్ధానం చేసిన నవరత్నాలను పరమ పవిత్రంగా భావిస్తూ ఎన్నికష్టాలు ఎదురైనా నవరత్నాల అమలులో వెనక్కి తగ్గలేదు.


సంక్షేమ ప్రభుత్వం
- వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా  36,70,425 మందికి  రూ.19,306.20 కోట్ల సాయం
- వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ. 5,615 కోట్లతో 17. 27 లక్షల మందికి  లబ్ది 
- వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 2,294 మందికి రూ.6.96 కోట్ల సాయం అందచేత
- వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.45.69 కోట్లు ఖర్చు
- వైఎస్సార్ లా నేస్తం ద్వారా 721 మందికి రూ.3.21 కోట్లు వెచ్చించారు
- వైఎస్సార్ ఆరోగ్య ఆసరా క్రింద 1,69,516 మందికి రూ.115 కోట్ల సాయం అందించిన ప్రభుత్వం
- వైఎస్సార్ ఆరోగ్య శ్రీ  పథకానికి  రూ.1,177.23 కోట్ల నిధులు విడుదల. ఈ పథకం ద్వారా  3,51540 మందికి లబ్ది

కుటుంబాలు, కులాల వారీగా

- సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 86 శాతం కుటుంబాలకు లబ్ది
- ఒకే పథకం అందుకున్న కుటుంబాలు 18 శాతం
- రెండు, అంత కన్నా ఎక్కువ లబ్ది పొందిన కుటుంబాలు 82 శాతం
- ప్రత్యక్ష, పరోక్ష నగదు కలిపి రెండేళ్లలో ఇచ్చిన మొత్తం రూ.1,31,725 కోట్లు
- ప్రత్యక్ష నగదు బదిలీ కింద నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసింది రూ.95,528 కోట్లు
- పరోక్ష నగదు కింద అందిన సాయం రూ.36,197 కోట్లు
- ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ.46,405 కోట్లు ఖర్చు చేయగా లబ్ది పొందిన బీసీలు  3,31,06,715 మంది
- ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 15,304 కోట్లు వెచ్చించగా లబ్ది పొందిన ఎస్సీలు 1,06,14,972  మంది
- ప్రత్యక్ష నగదు నగదు బదిలీ రూ. 4,915 కోట్లు జమ చేయగా లబ్ది పొందిన ఎస్టీలు 29,71,144  మంది
- ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 3,374 కోట్లు ఖర్చు చేయగా లబ్ది పొందిన మైనార్టీలు 19,88,961 మంది
- ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 7,368 కోట్లు వెచ్చించగా ప్రయోజనం పొందిన కాపులు 30,85,472 మంది
- ప్రత్యక్ష నగదు బదిలీ కింద రూ. 18,246 కోట్లు ఖర్చు చేయగా లబ్ది పొందిన ఓసీలు 1,49,21,396 మంది
 

మరిన్ని వార్తలు