విజయవాడలో అనధికార ఆస్పత్రులు

11 Aug, 2020 04:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

840 ఆస్పత్రులకు అగ్నిమాపక ఎన్‌వోసీలు లేవు

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో రమేశ్‌ ఆస్పత్రికి చెందిన ప్రైవేట్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం ఘటనతో కృష్ణా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల భద్రత చర్చనీయాంశమవుతోంది. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు చిన్నా, చితకా ఆస్పత్రులు, డెంటల్‌ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు తదితరాలు కలిపి 1,018 వరకు ఉండగా.. వీటిలో 88 ప్రభుత్వ ఆస్పత్రులు, మరో 90 ఇతర ఆస్పత్రులు మినహాయిస్తే 840 ఆస్పత్రులకు అగ్నిమాపక శాఖ అనుమతుల్లేవు. చాలా ఆస్పత్రుల్లో అగ్నిప్రమాద నియంత్రణ ఏర్పాట్లు కనిపించడం లేదు.

ప్రభుత్వ ఆస్పత్రులు మినహాయిస్తే పడకలు లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రులు, 25 పడకల లోపు, ఆపై ఉన్న పడకల ఆస్పత్రులు మొత్తం 930 ఉండగా వీటిలో కేవలం 90 ఆస్పత్రులకు మాత్రమే అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీలు ఉన్నాయి. మెజార్టీ ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ పంపింగ్‌ మోటార్లు, సంపులు లేవు. 50 శాతం ఆస్పత్రులు మాత్రమే  కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్, కన్సెంట్‌ ఫర్‌ ఆపరేషన్‌ లను కలిగి ఉన్నాయి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా