పద్దెనిమిదికి ముందే పెళ్లి! 

12 Feb, 2023 03:11 IST|Sakshi

కోవిడ్‌ కష్టకాలంలో దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు 

పెళ్లీడు రాకుండానే ఆడపిల్లలకు వివాహాలు... 

2022లో పెళ్లయిన అమ్మాయిల్లో 18ఏళ్లు నిండనివారు 25.3 శాతం మంది  

అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 41.6 శాతం... 

యూనిసెఫ్‌ వెల్లడి 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోవిడ్‌... ప్రతి మనిషిని ఆరోగ్యపరంగా, ఆర్థికం గా కుంగదీసింది. ఉపాధినీ దెబ్బతీసింది. ఆ మహమ్మారి వ్యాప్తి తగ్గినా... దాని ప్రభా­వం మాత్రం సమాజంపై వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. మనుషుల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉంది.

కోవిడ్‌ చేసిన గాయం కారణంగా అభద్రతాభావానికి గురవుతు­న్న తల్లి­దం­డ్రులు తమ కుమార్తెలకు వయసుతో నిమిత్తం లేకుండా వెంటనే పెళ్లిళ్లు చేయాలనే భావనలోకి వచ్చారని యూనిసెఫ్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. అందువల్లే దేశవ్యాప్తంగా 2022లో జరిగిన పెళ్లిళ్లలో 25.3శాతం మంది అమ్మాయిలు 18 ఏళ్లు నిం­డనివారే ఉన్నారని వెల్లడించింది. ఇందుకు కొన్ని కారణాలను ఈ సర్వేలో గుర్తించినట్లు తెలిపింది.  

మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్‌ 
పద్దెనిమిదేళ్ల వయసు నిండకముందే అమ్మాయిలకు వివాహాలు చేస్తున్న రాష్ట్రాల్లో పశి్చమ బెంగాల్‌ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 41.6 శాతం బాల్యవివాహాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో బిహార్‌ (40.8 శాతం), త్రిపుర (40.1శాతం), జార్ఖండ్‌ (32.2 శాతం), అస్సాం(31.8 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (29.3 శాతం) ఉన్నాయి. జమ్మూ–కశీ్మర్‌లో అత్యంత తక్కువగా 4.5 శాతం, కేరళలో 6.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు యూనిసెఫ్‌ గుర్తించింది.  

రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బాల్యవివాహాల పరిస్థితి  
మన రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 37.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో ఉమ్మడి కర్నూలు (36.9 శాతం), గుంటూరు (35.4 శాతం), విజయనగరం (33.7 శాతం), చిత్తూరు (28.1 శాతం), తూర్పుగోదావరి (26.0 శాతం), వైఎస్సార్‌ కడప (25.6 శాతం), శ్రీకాకుళం (25.4 శాతం), విశాఖపట్నం (25.4 శాతం), కృష్ణా (25.3 శాతం), నెల్లూరు (23.8 శాతం), పశి్చమగోదావరి (22.1 శాతం) చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు 2022లో వివాహాలు చేసినట్లు యూనిసెఫ్‌ వెల్లడించింది.   

ప్రధాన కారణాలు ఇవీ... 
కోవిడ్‌ కారణంగా దాదాపు రెండేళ్లు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. పది, ఇంటర్‌ చదువుతున్నవారు ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా చదువులో రాణించలేకపోయా­రు. ఫలితంగా డ్రాపవుట్స్‌ పెరిగాయి.  
చదువు మధ్యలో ఆపేసిన ఆడపిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు.  
కరోనా రాకముందు వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి సొంత గ్రా­మా­లకు వచ్చేశాయి. నిరుద్యోగిత పెర­గ­డంవల్ల ఆరి్థకంగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి.
అందువల్ల అభద్రతాభావంతో పెళ్లీడు రాకపోయినా ఆడపిల్లలకు వివాహాలు చేస్తే బాధ్యత తీరిపోతుందని ఎక్కు­వ మంది తల్లిదండ్రులు భావిస్తున్నట్లు సర్వేలో గుర్తించినట్లు యూనిసెఫ్‌ ప్రకటించింది.   

>
మరిన్ని వార్తలు