నేడు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

12 Aug, 2021 08:10 IST|Sakshi

సాక్షి, అమరావతి/కర్నూలు (సెంట్రల్‌): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా గురువారం శ్రీశైలం రానున్నారు. మధ్యాహ్నం 12.40 నుంచి 1.40 గంటల మధ్య ఆయన కుటుంబసభ్యులతో భ్రమరాంబదేవి, మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకోనున్నారు. దర్శనానంతరం భ్రమరాంబిక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని భోజనం చేస్తారు.

అనంతరం 2.40కి శ్రీశైలం నుంచి బయలుదేరతారని కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. అమిత్‌షాకు ఆలయంలో రాష్ట్ర దేవదాయ శాఖ తరుఫున స్వాగతం పలికేందుకు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహన్‌ బుధవారం రాత్రి శ్రీశైలానికి బయలుదేరి వెళ్లారు. 

మరిన్ని వార్తలు