బ్రేకింగ్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి గాయం

19 Aug, 2021 16:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి గాయమైంది. కారు ఎక్కుతుండగా కిషన్‌రెడ్డి తలకు డోర్‌ తగలడంతో గాయం తగిలింది. విజయవాడలో గురువారం జరిగిన జన ఆశీర్వాద సభ ముగించుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రథమ చికిత్స తీసుకుని తెలంగాణకు బయల్దేరారు. అయితే కార్యకర్తల అత్యుత్సాహంతో ఈ ఘటన జరిగింది. కారు ఎక్కేముందు ఫొటోల కోసం బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించిన సమయంలో కారు డిక్కీ తీసి వేస్తున్న సమయంలో గాయమైంది. అయితే గాయాన్ని లెక్కచేయకుండా తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్రకు బయల్దేరారు. కోదాడ బహిరంగ సభలో సాయంత్రం కిషన్‌రెడ్డి  పాల్గొన్నారు.

అంతకుముందు కిషన్‌ రెడ్డి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చా. నిన్న తిరుపతి వెంకన్నను, ఇవాళ దుర్గమ్మను దర్సించుకున్నా. దేశ సంస్కృతీసాంప్రదాయాలను పరిరక్షించాలని మోడీ అకాంక్షించారు. వరంగల్‌లోని వీరభద్ర ఆలయాన్ని యునెస్కొ హెరిటేజ్ సెంటర్‌గా గుర్తించింది. రానున్న రోజుల్లో ఏపీలో 126 కేంద్రాలున్నాయి. వాటిని  రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించి అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సీఎస్‌ఆర్‌ ఫండ్ కింద అభివృద్ధి చేస్తాం. పర్యాటక శాఖ చాలా ఛాలెంజ్‌తో జూడుకుంది. రెండేళ్లుగా కోవిడ్‌తో టూరిజం  దెబ్బతింది’ అని తెలిపారు.

జనవరి 1వ తేదీ నాటికి కోవిడ్ తగ్గగానే పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను  అందరికీ తెలిపేలా కార్యక్రమాలు చేపడతాం. పర్యాటక శాఖ ద్వారా నా వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడిగా అందిస్తా. ఏపీ, తెలంగాణ మోదీకి రెండు కళ్లులాంటివి. సీఎం జగన్ మర్యాదపూర్వకంగానే ఆహ్వానించారు. తెలుగువాడికి కేంద్ర‌మంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారు. దుర్మమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నా సహకారం అందిస్తా’ అని తెలిపారు.
 

చదవండి: కంటి ఆపరేషన్‌ చేయించుకున్న రాష్ట్రపతి
చదవండి: రుణాల ఎగవేత: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్‌

మరిన్ని వార్తలు