శ్రీకాకుళం: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

7 Aug, 2021 11:33 IST|Sakshi

పొందూరులో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పొందూరులో జరిగే జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ట దాస్, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గర రాజేంద్ర, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ జిల్లా అధికారులు స్వాగతం పలికారు. పొందూరు కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనాన్ని నిర్మలా సీతా రామన్ సందర్శించారు. ముందుగా చేనేత కార్యాలయం వద్ద నున్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి సీతారామన్. అనంతరం చేనేత కార్మికులతో కలసి వారి స్థితిగతులను మంత్రి  నిర్మలా తెలుసుకున్నారు. 

30 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న చేనేత కార్మికుల భవనానికి మంత్రి నిర్మలా సీతారామన్  శంకుస్థాపన చేశారు. అనంతరం మగ్గంపై నూలు వదులుతున్న నేత కార్మికుడిని స్వగృహానికి చేరుకుని కార్మికుడితో మాట్లాడారు. కేంద్ర మంత్రితో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం, విజయనగరం ఎంపీలు కే రామ్మోహన్ నాయుడు, బెందాలం చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ , జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఖాదీ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో జరిగే కార్య్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ప్రాంగణంలో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను నిర్మలా సీతారామన్ పరిశీలించారు.

పొందూరు ఖాదీకి ఖండాంతర ఖ్యాతి..
జిల్లాలో పొందూరులో తయారు చేసే ఖాదీ వస్త్రాల కు ఖండాంతర ఖ్యాతి ఉంది. ఇక్కడి నేత వస్త్రాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఎంతో మక్కువ తో ధరించేవారు. ఆయన కట్టుతో పొందూరు వస్త్రానికి ఎంతో గొప్పతనం లభించింది. ప్రఖ్యాత న టుడు అక్కినేని నాగేశ్వరరావుతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమ నటులు ఈ పొందూరు ఖాదీకి అభిమానులు.

చేప ముళ్లుతో ఇక్కడ నూలు వడికి, 40, 60, 80, 100 కౌంటులతో కూడిన వస్త్రాలు నేస్తారు. కేవీఐసీ(ముంబై) ఆధ్వర్యంలో పొందూరు ఏఎఫ్‌కేకే సంఘం ఉన్నప్పటికీ సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవా ర్డును అందించింది. త్వరలో నగదును అందించనుంది. ఏఎఫ్‌కేకే సంఘం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటీకీ కళలు, కళారంగంలో ప్రోత్సాహానికి గాను ఇస్తు న్న పురస్కారాల్లో భాగంగా ఏఎఫ్‌కేకే సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లైఫ్‌టైమ్‌ అవార్డు అందించింది.    

మరిన్ని వార్తలు