తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘ఉప్పెన’ టీం

27 Feb, 2021 10:12 IST|Sakshi

తిరమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్‌

సాక్షి, తిరుమల: ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయం అందుకున్నారు హీరో వైష్ణవ్‌ తేజ్‌, హీరోయిన్‌ కృతీ శెట్టి, దర్శకుడు బుచ్చి బాబు. వీరందరికి టాలీవుడ్‌లో ఇది డెబ్యూ చిత్రం కావడం విశేషం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. అదే రేంజ్‌లో వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ‘ఉప్పెన’ ఘన విజయం సాధించడంతో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర బృందం వెంకటేశ్వర స్వామీ ఆశీస్సుల కోసం తిరమల వెళ్లారు. 

హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీ శెట్టి, నిర్మాత నవీన్, డైరెక్టర్ బుచ్చిబాబు తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరంతా కాలినడకన కొండెక్కి స్వామిని దర్శించుకున్నారు. హీరో, హీరోయిన్‌లు కాలినడకన తిరుమల కొండ మెట్లెక్కుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలువుతున్నాయి. అనంతరం వీరంతా వీఐపీ బ్రేక్‌ దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు. ‘ఉప్పెన’ టీంతో పాటు తుడా చైర్మన్‌ చెవి రెడ్డి కూడా ఉన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న శివన్‌
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలిసారి ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలను ప్రయోగించనున్న సంగతి తెలిసిందే. పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ ద్వారా ఈ నెల 28 ఉదయం షార్‌ నుంచి రోదసిలోకి ఉపగ్రహాలను పంపనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్‌ శివన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్, ఎంపీ మార్గాని భరత్ తదితరులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: వరంగల్‌లో ఉప్పెన టీం సందడి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు