అమెరికాలో ప్రమాదం.. ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు

31 May, 2022 16:51 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: అమెరికాలో విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కేనవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ అక్కడికక్కడే మృతి చెందింది. సుప్రజ కుమారుడు అఖిల్‌ స్వల్పగాయాల బారిన పడ్డాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున మూడున్నర గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద ఘటనతో మక్కేనవారిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు