వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

22 Jun, 2022 09:31 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వంశీ కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: గుండె ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ

మరిన్ని వార్తలు