వర్సిటీలు అక్రిడిటేషన్‌ పొందాలి

6 Jun, 2021 06:11 IST|Sakshi
జేఎన్‌టీయూ–కేలో హాస్టల్‌ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ నుంచి రాష్ట్రంలో అన్ని వర్సిటీలు అక్రిడిటేషన్‌ పొందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. రూ.10 కోట్లతో చేపడుతోన్న పీజీ బాలుర హాస్టల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ.. జేఎన్‌టీయూ– విజయనగరంతో పాటు ఒంగోలులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

జాతీయ నూతన విద్యావిధానాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆమోదించారని, ఇందులో భాగంగానే అంగన్‌వాడీ కేంద్రాలను డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తున్నామని చెప్పారు. ప్రతి మండలానికి ఒక జూనియర్‌ కళాశాల ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు