'సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం'

20 Dec, 2020 14:43 IST|Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన సౌమ్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి శనివారం ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మహిళా చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. 'వరప్రసాద్‌ ప్రేమ వేధింపులకు గురై సౌమ్య చనిపోవడం బాధాకరం. సౌమ్య మృతిపై ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాం.. వారి బాధ వర్ణణాతీతం. ఈ విషయం ఇంట్లో చెబితే పరువు పోతుందని భావించిన సౌమ్య ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకుంది. ఈ నేపథ్యంలో వరప్రసాద్‌ వేధింపులు ఎక్కువవడంతో భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా డాక్టర్లు సౌమ్యను బతికించడానికి తీవ్రంగా కృషి చేశారు. వెంటిలేటర్ పై ఉన్నప్పుడు తాను పడ్డ బాధను సౌమ్య వీడియోలో చెప్పింది.(చదవండి :‘దయచేసి ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయండి’)

సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే పోలీసులు వరప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.. వారం రోజులలో అతనిపై చార్జిషీట్ కూడా దాఖలు చేస్తారు. గ్రామంలో ఆకతాయిలు వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళలు మా దృష్టి కి తెచ్చారు.. వెంటనే పికెట్‌ ఏర్పాటు చేయమని పోలీసులను ఆదేశించాం. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయంను అందిస్తాం. మహిళల రక్షణ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు. ఒంగోల్ లో జరిగిన భువనేశ్వరి సజీవదహనం అనుమానాస్పదంగా ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందో  తెలుసుకోవడానికి ఒంగోలు వెళ్తున్నానంటూ ' తెలిపారు.

మరిన్ని వార్తలు