తేజస్వినిని వెంకటేశ్‌ హత్య చేశాడు: డీఎస్పీ

2 Jul, 2021 16:13 IST|Sakshi
డీఎస్పీ రాజ్‌గోపాల్‌ రెడ్డి

సాక్షి, నెల్లూరు: గూడూరులో సంచలనం సృష్టించిన తేజశ్విని మృతి వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు చేధించారు. తేజశ్వినిని వెంకటేష్‌ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజ్‌గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ''తేజశ్వినిని వెంకటేష్ హత్య చేశాడు. తేజశ్విని మెడపై కత్తితో పొడిచి, టవల్‌తో గొంతు నులిమి చంపాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకుని వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. కొంతకాలంగా తేజశ్విని.. వెంకటేష్‌కు  దూరంగా ఉంటుంది, అయితే హత్య వెనుక మరెవరి ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం’’డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. వెంకటేష్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

బాధితులను పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
ఇదిలాఉంటే తేజశ్విని కుటుంబసభ్యులను మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ శుక్రవారం పరామర్శించారు. 'ఇలాంటి ఘటనలను సమాజం తీవ్రంగా పరిగణించాలి.  ప్రేమ పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. ప్రేమోన్మాది వెంకటేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలి' అని ఆమె పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు