ఎస్‌ఎస్‌సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్‌ విచారణ

6 Sep, 2021 16:00 IST|Sakshi
వాసిరెడ్డి పద్మ ( ఫైల్‌ ఫోటో )

సాక్షి,విజయవాడ: ఎస్‌ఎస్‌సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్‌ సోమవారం విచారణ చేపట్టింది. ఎస్‌ఎస్‌సీ బోర్డులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్నవేధింపులపై కొద్దిరోజుల క్రితం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.

ఎస్‌ఎస్‌సీ బోర్డులో ఉద్యోగిణులు వేధింపులపై వచ్చిన ఫిర్యాదులపై ఆరోపణల వివరాలతో కూడిన విచారణ నివేదికను త్వరలో అందజేస్తామన్నారు. వెంటనే అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. వివిధ శాఖల ఉద్యోగ బాధ్యతల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కానీ మహిళలపై ఇతర వేధింపుల సంఘటనలను సీరియస్‌గా పరిగణిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు