'పిల్లల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టి.. భరోసా కల్పించడమే ఉద్దేశ్యం'

20 Nov, 2020 13:01 IST|Sakshi

సాక్షి, గుంటూరు: అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ 'టేక్ ఓవర్' పేరుతో శుక్రవారం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాధ పిల్లలను మహిళా కమిషన్ చైర్మన్, మెంబర్లను సీట్లో కూర్చోబెట్టి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ 'టేక్ ఓవర్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. పిల్లలో ఏం ఊహించుకుంటున్నారో వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టి వారిలో భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం అని అన్నారు.   ('బాబు జీవితం మొత్తం వెన్నుపోట్లు, శవరాజకీయాలే')

నవజీవన్‌ బాలభవన్‌, కేర్‌ అండ్‌ షేర్‌ అనాధాశ్రమం నుంచి విద్యార్థుల్ని తీసుకువచ్చామని తెలిపారు. జ్యోత్స్న చైర్మన్‌గాను, మిగిలిన పిల్లలు నెంబర్లుగానూ వారి సీట్లలో కూర్చున్నట్లు పేర్కొన్నారు. జ్యోత్స్న 30 అవార్డులతో పాటు విలువిద్యలో రాష్ట్రపతి అవార్డు పొందిన విద్యార్థిని అని తెలిపారు. అటువంటి విద్యార్థిని మహిళా కమిషన్ చైర్మన్ కుర్చీలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వాళ్లంతా మహిళల రక్షణ కోసం నిలబడతాం పాటుపడతారని చెప్పారు. ఇది మహిళా కమిషన్ తొలి అడుగు మాత్రమే అని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ వివరించారు.  ('ఇలాంటిదెప్పుడైనా ఊహించారా.. దటీజ్‌ సీఎం జగన్‌')

మరిన్ని వార్తలు