మైనారిటీ తీరకముందే యువత పెడదొవపడుతుంది

4 Dec, 2020 16:35 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: మైనారిటీ తీరకముందే యువత ప్రేమ మోజులో పడి పెడవదోవ పడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మా అన్నారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్న రాజమహేంద్రవరం ప్రభుత్వ కళశాల తరగతి గదిలో విద్యార్థులు పెళ్లి చేసుకున్న సంఘటన చూసి షాకయ్యానన్నారు. మైనర్‌ బాలిక, బాలుడు తీరు తప్పైనప్పటికి బాలికకు ప్రభుత్వం నుండి రక్షణ కల్పించి కౌన్సిలింగ్‌ ఇస్తామన్నారు.

బాలికతో పాటు ఇంటి నుంచి వెలివేసిన తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పారు. సమాజంలో మహిళలపై జరిగే అరాచకాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు.. మోసాలపై వార్డు గ్రామ, మండల.. పట్టణ స్థాయి వరకు పరిస్థితులను పరిశీలించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళలకు అండగా ఉన్న చట్టాలపై  గ్రామీణ స్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతామని వాసిరెడ్డి పద్మా తెలిపారు.

మరిన్ని వార్తలు