19న వేమన జయంతి

13 Jan, 2023 04:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన కవి యోగి వేమన జయంతి వేడుకలను ఈ నెల 19వ తేదీన తొలిసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సత్యసాయి జిల్లా కటారుపల్లెలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు తెలిపారు.

మల్లికార్జునరావు స్వయంగా గీసిన వేమన చిత్రపటాన్ని గురువారం ఆ­విష్కరించి 19న నిర్వహించనున్న కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా కటారుపల్లెలో నిర్మించిన వేమన విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరిస్తారని తెలిపారు.

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని వేమన జీవితానికి, ఆయన బోధనలకు, జ్ఞానాన్ని పొందిన విధానానికి రూపం ఇస్తూ తాను చిత్రాన్ని గీశానని, దానిని ప్ర­­జ­లకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. స­మా­జంలోని మూఢనమ్మకాలను వేమన తన కవిత్వంతో ఖండించి ప్రజలను చైతన్యం చేశారన్నారు.  

మరిన్ని వార్తలు