బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి

26 Jun, 2021 20:02 IST|Sakshi

ఫలించిన చర్చలు.

ఏకాభిప్రాయానికి వచ్చిన రెండు కుటుంబాల వారసులు 

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఠాధిపతి ఎంపిక పూర్తయ్యింది. రెండు కుటుంబాల వారసులు ఏకాభిప్రాయానికి వచ్చారు. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి బాధ్యతలు అప్పగించారు. ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి నియమితులయ్యారు.

చదవండి: ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ పదవీకాలం పొడిగింపు
విద్యాభివృద్ధికి ‘సాల్ట్‌’ పథకం: మంత్రి ఆదిమూలపు సురేష్

మరిన్ని వార్తలు