‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’

26 Jan, 2021 17:45 IST|Sakshi

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి

సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికలు జరపవద్దని తాము ఎప్పుడూ అనలేదని.. కరోనా వల్ల ఉద్యోగులకు ఇబ్బందులు వస్తాయనే చెబుతున్నామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలకు సహకరిస్తామన్నారు. సీఎస్‌ను కలిసి తమ సమస్యలను చెప్తామని. మహిళా ఉద్యోగులను ఎన్నికల నుంచి మినహాయించాలని ఆయన కోరారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. చదవండి: ‘దేశంలో కోరుకుంటున్న మార్పును ప్రభుత్వం చేసింది’

గతంలో ఉద్యోగులను ఢిల్లీ తీసుకెళ్లి బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?. పోలవరం, నవనిర్మాణ దీక్షలకు బస్సులు పెట్టి ఉద్యోగులను తరలించలేదా? అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. అప్పట్లో ప్రతిపక్షం తమ గురించి ఏ వ్యాఖ్యలు చేయలేదు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వారు ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. తమపై రాజకీయాలు చేయొద్ధని మండిపడ్డారు. ఎన్నికల సంఘంపై తాము ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: రాజ్యాంగం ఇప్పటికీ మార్గనిర్దేశం చేస్తూ ఉంది: సీఎం జగన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు