Chelluboyina Venu Gopala Krishna: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చెల్లుబోయిన వేణు

12 Apr, 2022 10:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌ శాఖ మంత్రిగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం చెల్లుబోయిన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చీఫ్‌ విప్‌ ముదనూరి ప్రసాదరాజు, ఐ అండ్‌ పీఆర్‌ శాఖాధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు.

నేపథ్యం
పేరు: చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ 
నియోజకవర్గం: రామచంద్రాపురం 
స్వస్థలం: అడవిపాలెం  
తల్లిదండ్రులు: సుభద్రమ్మ, వెంకన్న (లేట్‌) 
పుట్టినతేదీ: డిసెంబర్‌ 23, 1962 
విద్యార్హతలు: బీఏ 
సతీమణి: వరలక్ష్మి 
సంతానం: కుమారులు నరేన్, ఉమాశంకర్‌  
జిల్లా: కోనసీమ 

రాజకీయ నేపథ్యం: 2001లో రాజోలు జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2006లో తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2008–12లో తూర్పుగోదావరి డీసీసీ అధ్యక్షుడిగా, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2013లో వైఎస్సార్‌సీపీ కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో 2020 జూలై 24న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రెండోసారి అవకాశం దక్కించుకున్నారు.

చదవండి: (Kakani Govardhan Reddy: అన్నదాత.. వ్యవసాయశాఖ మంత్రయ్యాడు)

మరిన్ని వార్తలు