సంగీత విద్వాంసుడు సంగీతరావు కన్నుమూత

3 Jun, 2021 07:18 IST|Sakshi

సాక్షి, చెన్నై: సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు అయిన పట్రాయని సంగీతరావు ఇకలేరు. కరోనా మహమ్మారి బారిన పడ్డ ఆయన బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతం లో చెన్నైలో కన్నుమూశారు. సినీ సంగీత దిగ్గజం ఘంటసాలకు సహాయకుడిగా పనిచేసిన ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమా ర్తెలు. 1920 నవంబర్‌ 2న విజయనగరం జిల్లా కిండాం అగ్రహారంలో జన్మించిన సంగీతరావు వయసు 101 ఏళ్లు.

పట్రాయని వారి సంగీత కుటుంబంలో మూడోతరానికి చెందిన సంగీత రావు అసలు పేరు నరసింహమూర్తి. అయితే, హార్మోనియం వాయించడంలో దిట్ట అయిన ఆయన సంగీతరావుగానే సుపరిచితులు. ఘంటసాల స్వర సహాయకుడిగా 1974 వరకు సుమారు పాతికేళ్ల పాటు తెలుగు సినిమాతో సంగీతరావు జీవితం ముడిపడివుంది.

సాహితీ రంగంలోనూ సంగీతరావు ఎంతో ప్రతిభను కనపరిచారు. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జగతి వంటి ప్రముఖ పత్రి కలలో సంగీతరావు రచనలు వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం  సంగీతరావును కలై మామణి బిరుదుతో సత్కరించింది.
చదవండి: వరదగూడు..  కనువిందు చేసెను చూడు! 

మరిన్ని వార్తలు