అసైన్డ్‌ ల్యాండ్‌ స్కాం: భయపెట్టి పొలం లాక్కున్నారు..

19 Mar, 2021 12:46 IST|Sakshi

ఒక్కొక్కరుగా బయటికొస్తున్న అసైన్డ్‌ భూముల కుంభకోణం బాధితులు

అన్యాయం చేశారు.. బాధితుల ఆవేదన

సాక్షి, గుంటూరు: టీడీపీ హయాంలో జరిగిన అమరావతి భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమరావతిలో జరిగిన అసైన్డ్‌ భూముల స్కామ్‌ తాజాగా సీఐడీ దర్యాప్తులో బట్టబయలవడం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నుంచి భూముల కేటాయింపుల వరకు చోటు చేసుకున్న అక్రమాలు చర్చనీయాంశంగా మారాయి. రాజధాని అసైన్డ్‌ భూముల కుంభకోణంలో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధిత రైతు ప్రకాశం మీడియాతో మాట్లాడుతూ ‘‘నాకు కృష్ణాయపాలెంలో ఎకరా 20 సెంట్ల అసైన్డ్‌ భూమి ఉంది. గత 40 ఏళ్ల నుంచి భూమిని సాగు చేస్తున్నా. రాజధాని ప్రకటించగానే దళితులు సాగు చేస్తున్న అసైన్డ్‌ భూమిని.. రాజధాని కోసం ప్రభుత్వం తీసుకుంటుందని ప్రచారం చేశారు. అప్పటి మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎంపీ జయదేవ్‌ ఈ ప్రచారం చేయించారు. భయపెట్టి, మానసికంగా హింసించి తక్కువ రేటుకు పొలం లాక్కున్నారని’’ ఆయన వాపోయారు.

పొలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారని.. తమ చేతే భూమిని ల్యాండ్‌ పూలింగ్‌కు ఇప్పించారని.. ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చిన భూమి రిటర్న్‌ ప్లాట్లు ఇస్తారని చెప్పారని.. ప్లాట్లు ఇచ్చే సమయంలో కొనుగోలుదారులు తమ పేరుపై రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నించారన్నారు. అసైన్డ్‌ భూమి విషయంలో తమకు తీవ్రమైన అన్యాయం చేశారని, మమ్మల్ని మోసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని రైతు ప్రకాశం డిమాండ్‌ చేశారు.
చదవండి:
అక్రమాల పుట్ట ‘అమరావతి’
చంద్రబాబుకు శిక్ష తప్పదు..

 

>
మరిన్ని వార్తలు