ఎమ్మెల్యే  కానివాడు సీఎం కుర్చీ ఎక్కుతాడట!:

31 Mar, 2021 13:13 IST|Sakshi

సోము వ్యాఖ్యలపై ట్విటర్‌లో విజయసాయిరెడ్డి సెటైర్లు

సాక్షి, అమరావతి: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జనసేన, బీజేపీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీకి కాబోయే సీఎం పవన్‌ కల్యాణ్‌ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ట్విటర్‌ వేదికగా సెటైర్లు వేశారు. ఈ మేరకు.. ‘జరుగుతున్నది తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక, కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కెట్‌ వేయడం కాక మరేమిటి?. ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికిలేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.
చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: అత్యంత సంపన్న అభ్యర్థి ఆమే!

'గంట'ల పంచాంగం
‘టీడీపీ గెలుస్తోందని ఊదరగొడుతూ ఎన్నికలకు ముందు ఆంధ్రా ఆక్టోపస్ బయలుదేరాడు. ఆక్టోపస్ ఫ్లాప్ షోతో దిగ్గజ విశ్లేషకుణ్ణి పచ్చ మీడియా రంగంలోకి దించింది. ఇప్పుడు విశాఖ నుంచే మరో జోస్యుడు తయారయ్యాడు. అతను తిరుపతి ఉప ఎన్నికల్లో 'గంట'ల పంచాంగం చెబుతున్నాడు’ అని విజయసాయిరెడ్డి మంగళవారం నాటి ట్వీట్‌లో పేర్కొన్నారు.  ‘తిరుపతి పేరు వింటేనే చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మొన్నటి పంచాయతీ, మున్సిపల్ తీర్పుతో వచ్చిన జ్వరం ఇంకా తగ్గక ముందే బై ఎలక్షన్ వచ్చిపడింది. 2లక్షల జనాభా,50 వార్డులున్న కార్పోరేషన్లో ఒక్కటే దక్కింది. మిగిలిన 6 సెగ్మంట్లలో ఇదే దుస్థితి. ఓటమి పగపట్టినట్టు తరుముతోంది’ అని ట్విటర్‌లో బాబుపై విమర్శలు గుప్పించారు.

మరిన్ని వార్తలు