‘విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరు’

30 Jun, 2021 14:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: దిశ యాప్ మహిళల రక్షణకు వజ్రాయుధం వంటిదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. దిశ యాప్‌పై సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. విశాఖకు పరిపాలన రాజధాని రావడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్నికల హామీ మేరకు అర్బన్ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 98 వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశలో కార్పొరేషన్‌ పనిచేస్తోందని ఎంపీ పేర్కొన్నారు.

అదే విధంగా సంచయితపై అశోక్‌గజపతిరాజు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. విలువైన భూములను అశోక్‌గజపతిరాజు స్వాహా చేశారని విమర్శించారు. రికార్డులు తారుమారు చేశారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. విచారణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

చదవండి: AP: సిరులు కురిపిస్తున్న ‘అనంత’ పంటలు
‘చంద్రబాబు మూడు గంటల బ్రేక్ ఫాస్ట్ దీక్ష చేశారు’

మరిన్ని వార్తలు