ప్రధాని మోదీకి లేఖరాసిన ఎంపీ విజయసాయిరెడ్డి

23 Jul, 2021 22:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: రఘురామకృష్ణంరాజుకి సంబంధించిన కంపెనీలు చేసిన మోసాలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో ఏముందంటే.. 'ఇండ్‌ భారత్‌ పవర్‌ లిమిటెడ్‌ మరికొన్ని కంపెనీలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోసం చేశాయి. ఆ సంస్థలకు రఘురామ కృష్ణరాజు, మధుసూదన్ రెడ్డిలు డైరెక్టర్లుగా ఉన్నారు. వీరు రూ. 941 కోట్లు మోసం చేశారని ఢిల్లీ సీబీఐ కోర్టులో 3 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

ప్రభుత్వ సంస్థలను మోసం చేయడమంటే ప్రజలను మోసం చేయడమే. సంబంధిత డైరెక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. డైరెక్టర్లు ఇతర దేశాలు పారిపోకుండా అడ్డుకోవాలి.  మోసం చేసిన నిధులను వారి వద్ద నుంచి రాబట్టాలి. నిజాలు రాబట్టడానికి వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి' అని పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు