175 స్థానాల్లో గెలుపే లక్ష్యం

4 Jul, 2022 05:03 IST|Sakshi
పార్టీ బూత్‌ కమిటీల కన్వీనర్ల సమావేశంలో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి

బూత్‌ కన్వీనర్ల సమావేశంలో విజయసాయిరెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుడు వి.విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన రాష్ట్రంలోని పార్టీ బూత్‌ కమిటీల ఇన్‌చార్జిలు, కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 151 స్థానాల్లో గెలుపొందడానికి బూత్‌ కమిటీల కృషి ఎంతో ఉందన్నారు. బూత్‌ కమిటీలను పకడ్బందీగా చేపట్టి 2024 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసి 175 స్థానాల్లో విజయం సాధించే దిశగా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డిని బూత్‌ కమిటీల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో బూత్‌ కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి, కో–ఆర్డినేటర్‌ కొండమడుగుల సుధాకర్, రాయలసీమ ప్రాంత బూత్‌ కమిటీల కన్వీనర్‌ డాక్టర్‌ పి.మదనమోహన్‌రెడ్డి మాట్లాడారు. 

మరిన్ని వార్తలు