జీవీఎంసీలో ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారం

27 Feb, 2021 18:46 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైద్యరంగంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమూల మార్పులు తెచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గ్రేటర్‌ విశాఖలో శనివారం మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారని పేర్కొన్నారు. వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ ఫలాలు ఇంటింటికి అందజేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి పెద్దపీట వేసిన సీఎం జగన్‌.. నాడు-నేడు ద్వారా విద్యా ప్రమాణాలను పెంచారని కొనియాడారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనేది సీఎం లక్ష్యమని అన్నారు. కాలువలు, రోడ్లు, స్వయం సహాయక సంఘాల భవనాలు వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్చించినట్లు పేర్కొన్నారు.

చదవండి: పుర పోరు.. వైఎస్సార్‌ సీపీ ప్రచార జోరు

మరిన్ని వార్తలు