వైఎస్‌ పథకాలు దేశ చరిత్రలో ఓ అధ్యాయం

9 Jul, 2021 04:23 IST|Sakshi

ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్య

ఢిల్లీలో వైఎస్‌కు ఎంపీల ఘన నివాళి

న్యూఢిల్లీ, జూలై 8: దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పేదల అభ్యున్నతి కోసం చేపట్టిన పథకాలు దేశ చరిత్రలో ఓ అధ్యాయంగా నిలిచాయని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అభివర్ణించారు.

ఢిల్లీలోని బాల్‌ సహయోగ్‌లో గురువారం వైఎస్సార్‌ 72వ జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్‌ చిత్రపటం వద్ద  ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గా ని భరత్‌రామ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. చిన్నారులతో కేక్‌ కట్‌చేయించారు. బాల్‌ సహయోగ్‌లోని అనాథ బాలురకు, అక్కడ పనిచేసే మహిళలకు వస్త్రాలు, మిఠాయిలు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు