పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ గౌతమ్ సవాంగ్

13 Aug, 2021 12:01 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ పరేడ్, సీఎం ప్రసంగం మాక్‌డ్రిల్‌ను పోలీసులు నిర్వహించారు. ఈ వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేడుకలకు వీవీఐపీ, వీఐపీలతో పాటు కొందరికే అనుమతినిచ్చినట్లు తెలిపారు. వర్షం కురిసినా పరేడ్‌కు అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు