అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ దర్శనం 

30 Sep, 2022 08:42 IST|Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో నాలుగో రోజైన గురువారం దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి అమ్మవారికి పట్టు వ్రస్తాలను సమర్పించారు.

గురువారం సుమారు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. అన్నపూర్ణాదేవి విశేష అలంకారం కావడంతో భక్తులు ప్రసాద స్వీకరణకు బారులు తీరారు. సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవంలో  పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మవారిని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభు త్వ విఫ్‌ కోరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు.

నేడు శ్రీలలితా త్రిపుర సుందరిగా..
దసరా ఉత్సవాల్లో 5వ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు