నేడు ఉదయం 7 గంటల వరకే దుర్గమ్మ దర్శనం   

8 Nov, 2022 05:37 IST|Sakshi

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): చంద్రగ్రహణం కారణంగా ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఆలయాలతోపాటు ఉపాలయాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల వరకే దర్శనానికి అనుమతిస్తారు. ఎనిమిది గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తారు.

గ్రహణ మోక్షకాలం అనంతరం సాయంత్రం 6.30గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి శుద్ది, అమ్మవారికి స్నపనాభిషేకం, అర్చన, మహానివేదన, హారతులను ఇచ్చి ఆలయ ద్వారాలను తిరిగి మూసివేస్తారు. బుధవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.

గ్రహణం నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, ఖడ్గమాలార్చన, గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమాలను మాత్రమే నిర్వహిస్తారు.

ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే లక్ష కుంకుమార్చన నుంచి సాయంత్రం పంచహారతులు వరకు అన్ని సేవలను రద్దు చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి అన్ని ఆర్జిత సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఆలయ వైదిక కమిటీ తెలిపింది.  

మరిన్ని వార్తలు