దుర్గమ్మ దసరా హుండీ లెక్కింపు ప్రారంభం

26 Oct, 2021 05:43 IST|Sakshi
కానుకల లెక్కింపును పర్యవేక్షిస్తున్న చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ

తొలిదఫా లెక్కింపులో రూ.2.87 కోట్లు లభ్యం

నేడు కొనసాగనున్న కానుకల లెక్కింపు 

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ కనకదుర్గ అమ్మవారికి దసరా ఉత్సవాలలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపును సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో చేపట్టారు. తొలిదఫా లెక్కింపులో రూ.2,87,83,153 నగదుతో పాటు 546 గ్రాముల బంగారం, 9.553 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. మంగళవారం (నేడు) కూడా హుండీ కానుకల లెక్కింపు కొనసాగుతుందని ఆమె తెలిపారు. కానుకల లెక్కింపును దేవస్థానం చైర్మన్‌ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించగా, ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు