శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు

25 Oct, 2020 10:03 IST|Sakshi

అంబా శాంభవి చంద్రమౌళి 
రబలా– ఉపర్ణా హ్యుమా పార్వతీ 
కాళీ హైమవతీ శివా త్రినయనీ 
కాత్యాయనీ భైరవీ 
సావిత్రీ నవయవ్వనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా 
చిద్రూపీ పరదేవతా భగవతీ 

సాక్షి, విజయవాడ : శరన్నవ రాత్రి మహోత్సవాలలో భాగంగా 9వ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదింపజేసే రూపంలో శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టానదేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి, అర్చించటం వలన మనకు సకల శుభాలు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని మనందరికీ అందింపజేసే చల్లని తల్లిగా దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరిదేవి అలంకారంలో కనిపించే అపూర్వమైన రోజు. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం.. సకల శుభాలు,  విజయాలు ఈ రోజు అమ్మవారి దివ్యదర్శనం ద్వారా మనకు లభిస్తాయి.  అమ్మవారి దర్శనార్దం వేలాదిగా భవానీ భక్తులు తరలి వస్తున్నారు. దుర్గమ్మ దర్శనానిని గంటన్నరకు పైగా సమయం పడుతోంది. అలాగే ఇవాళ ఉదయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి దుర్గమ్మను దర్శించుకున్నారు.  ('అమ్మ'కు ఆరగింపు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా