నా కొడుకుని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

11 Oct, 2020 11:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసే మహేష్‌ హత్యకు గురికావడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. మరణవార్త తెలిసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 'నా కొడుకు చివరగా శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత అర్ధరాత్రి సమయంలో నా కొడుకు చనిపోయినట్లు పోలీసులు సమాచారం అందించారు.

మహేష్‌కు ఎలాంటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు లేవు. నా కొడుకును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి' అంటూ మహేష్‌ తల్లి విమల మీడియాకు వివరించారు. మహేష్‌ సోదరి సునీత మాట్లాడుతూ.. 'మహేష్‌కి ఎవరితోనూ విభేదాలు లేవు. అందరితోనూ సరదాగా ఉండేవాడు. అలాంటి వాడిని హత్య చేశారు. పోలీసులు మాకు న్యాయం చేయాలి' అని అన్నారు.  (బెజవాడ నగర శివారులో దారుణ హత్య)

మరిన్ని వార్తలు