సేవా ‘మార్గం’.. ‘డాక్టర్స్‌’ ఔదార్యం

20 May, 2021 17:32 IST|Sakshi

కరోనా మానవ సంబంధాలను దూరం చేస్తోంది. అయిన వారిని సైతం కాకుండా చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్‌ బాధితులకు మేమున్నామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వారికి అవసరమైన మందులు, ఆహారాన్ని ఉచితంగా అందించడమే కాకుండా.. నేరుగా వారి ఇంటికే వెళ్లి వారిలోని ఆందోళనను తొలగించేలా మనో స్థైర్యాన్ని నింపుతున్నాయి.


విజయవాడలోని మార్గం ఫౌండేషన్‌ కూడా ఇదే విధంగా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న రోగులకు రోజూ రెండు వందల మందికి భోజనాన్ని పంపిణీ చేస్తోంది. ఆహారం ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న ‘మార్గం’ సభ్యులను చిత్రంలో చూడొచ్చు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ 

‘డాక్టర్స్‌ ఫర్‌ యూ’ ఔదార్యం
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి డాక్టర్స్‌ ఫర్‌ యూ ఆర్గనేషన్‌ సంస్థ 8 లక్షల రూపాయల విలువచేసే మూడు జంబో ఆక్సిజన్‌ సిలెండర్లను వితరణ చేసింది. వీటిని కొత్త ప్రభుత్వాసుపత్రి ఆవరణలోడాక్టర్స్‌ ఫర్‌ యూ ఆర్గనేషన్‌ సంస్థ ప్రతినిధులు బుధవారం కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌కు అందజేశారు. క్రయోజనిక్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ జంబో సిలెండర్‌ల ద్వారా ఎక్కువ మందికి ప్రాణవాయువు సరఫరా చేసే వీలు కలుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్‌ అన్నారు. డాక్టర్స్‌ ఫర్‌ యూ ఆర్గనేషన్‌ సంస్థ ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. గతంలోనూ ఈ సంస్థ బెడ్‌లు, మాస్క్‌లు, కిట్స్‌ అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

పెద్దయ్యాక సీఎం అవుతా..  ఓ చిన్నారి ఆకాంక్ష

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు