చదువులో నా బిడ్డ టాపర్.. మల్టీ టాలెంటెడ్.. పుట్టుకతోనే..

31 Jan, 2022 20:49 IST|Sakshi

సాక్షి, విజయవాడ: లైంగిక వేధింపులు తాళలేక తొమ్మిదో తరగతి బాలిక విజయవాడలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాలిక తల్లి అనురాధ సోమవారం సాక్షి టీవీతో మాట్లాడారు. 'నా బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకున్నాం. ఇప్పటివరకు బిడ్డ రక్తపు చుక్క కూడా చూడలేదు. చదువులో నా బిడ్డ టాపర్.. మల్టీ టాలెంటెడ్. పుట్టుకతోనే ఎన్నో మంచి లక్షణాలు వచ్చాయి. చనిపోవడానికి రెండ్రోజుల ముందు పాప ఏడ్చింది. అడిగితే మిమ్మల్ని మిస్ అవుతున్నానంటూ బాధపడింది. ఇంక ఏ సమస్యలు లేవని చెప్పింది.

చదవండి: (కామాంధుడు! విజయవాడలో టీడీపీ నేత అకృత్యం)

చనిపోయే రోజు సాయంత్రం చివరిసారిగా నాతో మాట్లాడండి. అమ్మ ఐ లవ్యూ అంటూ రెండుసార్లు పిలిచి గట్టిగా హగ్ చేసుకుంది. అప్పటికే ఐదు పేజీల సూసైడ్ నోట్ నా బిడ్డ రాసుకుంది. టుడే ఈజ్ లాస్ట్ డే.. డెత్ డే అంటూ సూసైడ్ నోట్లో రాసింది. ఎవరో ఒక పాప బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోయిందంటూ చెప్పడంతో వెళ్లి చూశాం. సూసైడ్ చేసుకువడానికి కారణమైన వినోద్ జైన్‌ని నడిరోడ్డులో ఎన్ కౌంటర్ చేయాలి. అప్పుడే నా బిడ్డకు ఆత్మ శాంతిస్తుంది.

చదవండి: (‘నా బిడ్డ జీవితాన్ని చిదిమేసిన కామ పిశాచిని ఉరి తీయండి’)

తాత లాంటి వయసులో నా బిడ్డను ఇంత దారుణంగా లైంగికంగా వేధించిన వినోద్ జైన్‌ను శిక్షించాలి. ఏ తల్లికీ మాలాంటి గర్భశోకం కలగకూడదు. పిల్లలను అందరూ జాగ్రత్తగా పెంచాలి. ముఖ్యమంత్రిని కలిసి నా గోడు వెళ్లబోసుకుంటాను. నాకు ఎలాంటి ఎక్స్‌గ్రేషియా వద్దు. మరో బిడ్డకు ఇలాంటి గతి పట్టకూడదు. సీఎం జగన్ చట్టాలను మరింత బలోపేతం చేసి మృగాళ్లను కఠినంగా శిక్షించాలి. మా పాపకు న్యాయం చేయాలి' అంటూ బాలిక తల్లి అనురాధ కన్నీటి పర్యంతమైంది. 

మరిన్ని వార్తలు