కోవిడ్‌ సేవలు భేష్‌! 

10 Aug, 2021 05:01 IST|Sakshi
డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డిని సత్కరిస్తున్న సీపీ శ్రీనివాసులు, ఇతర అధికారులు

ప్రయివేటు ఆస్పత్రికి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ప్రశంస   

లబ్బీపేట(విజయవాడ తూర్పు): కోవిడ్‌ సమయంలో సాయిభాస్కర్‌ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్‌ నిర్వాహకులు పోలీస్‌ సిబ్బందికి అందించిన వైద్య సేవలను ఎన్నటికీ మరువలేమని విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు అన్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో బెడ్‌లు దొరకని పరిస్థితుల్లో సైతం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పోలీసు సిబ్బంది, అ«ధికారులకు వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా పోలీస్‌ శాఖ తరపున అభినందనలు తెలుపుతూ, కోవిడ్‌ సమయంలో విశేష సేవలు అందించినందుకు గాను ఆస్పత్రి అధినేత డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఆస్పత్రి వైద్యులు కోటగిరి ఆకర్ష్, డాక్టర్‌ డి.విజయకుమార్‌లను సీపీ శ్రీనివాసులు సోమవారం సత్కరించారు.

సీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ..కమిషనరేట్‌ పరిధిలో కోవిడ్‌ బారిన పడిన 34 మంది అధికారులు, సిబ్బందికి సాయి భాస్కర్‌ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందించారని చెప్పారు. డాక్టర్‌ నరేంద్రరెడ్డి మాట్లాడుతూ కరోనా బాగా వ్యాపిస్తున్న సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ముందడుగు వేశామన్నారు. అందులో భాగంగా పోలీసులకు వైద్య సేవలు అందించడం తమ బాధ్యతగా గుర్తించామన్నారు. గుంటూరు ఆస్పత్రిలో సైతం 64 మంది పోలీసులకు రూ.64 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు కేవీ మోహనరావు, మేరీ ప్రశాంతి, హాస్పిటల్‌ సీఈఓ డాక్టర్‌ ఎం.సాంబశివారెడ్డి పాల్గొన్నారు.  

 

మరిన్ని వార్తలు