ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌: అతి పిన్న వయస్కుడిగా బెజవాడ విద్యార్థి ఘనత

11 Aug, 2021 10:24 IST|Sakshi

పటమట (విజయవాడ తూర్పు): పటమటకు చెందిన గానుగుల కార్తికేయకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటంతో పాటు కేవలం నాలుగేళ్లలో (2014–2018) ప్రాథమిక నుంచి రాష్ట్రీయ భాషా ప్రవీణ వరకు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడిగా గుర్తించి పురస్కారాన్ని అందిస్తున్నట్లు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చీఫ్‌ ఎడిటర్‌ బిష్వరూప్‌రాయ్‌  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం కార్తికేయ పదో తరగతి చదువుతున్నాడు.

మరిన్ని వార్తలు