Ganesh Chaturthi 2022: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

31 Aug, 2022 10:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా చలువ పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసి గణనాథుని ప్రతిష్టించిన భక్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి జోగిరమేష్‌, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి గణేషుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
చదవండి: వినాయకుడినే మొదట ఎందుకు పూజించాలి? 

కాగా, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు.

మరిన్ని వార్తలు