సోషల్‌ మీడియాలో చూసినా.. సత్వర పరిష్కారం 

4 Sep, 2020 07:53 IST|Sakshi

విశాఖ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ స్పందన

పెరాలసిస్‌ రోగిని కేజీహెచ్‌లో చేర్పించిన వైనం

సాక్షి, విశాఖపట్నం: ప్రజల సమస్యలు ఏవిధంగా తెలిసినా తక్షణమే స్పందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన అధికార యంత్రాంగాన్ని స్ఫూర్తిమంతంగా కదిలిస్తోంది. సమావేశాల్లో, ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చిన విజ్ఞాపనలను సత్వరమే పరిష్కరించడంలో విశాఖ జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్‌ ముందున్నారు. ఇటీవల సోషల్‌ మీడియాలో కనిపించిన ఓ పోస్టు విషయంలోనూ అదే స్పందన చూపించడం ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతోంది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలో కూండ్రం గ్రామానికి చెందిన మజ్జి పవిత్ర తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. (చదవండిఅంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్‌)

తన తండ్రి అప్పలనాయుడికి పెరాలసిస్‌ వచ్చిందని, చేతిలో డబ్బులు లేక ఇంటి దగ్గరే ఉంచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఆర్థిక సహాయం తమకేమీ వద్దని, తన పోస్టు సీఎం గారి వద్దకు చేరేలా చూడాలని, లేదా ఉచిత ఆసుపత్రి ఏదైనా ఉన్నా చెప్పాలని కోరింది. ఆ పోస్టును చూసిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సత్వరమే స్పందించారు. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌తో మాట్లాడి బెడ్‌ ఏర్పాటు చేయించారు. ఆర్‌డీవోను పంపించి అప్పలనాయుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకొచ్చేవరకూ పర్యవేక్షించారు. కేజీహెచ్‌లో మంచి వైద్యం అందించడంతో అప్పలనాయుడు కోలుకున్నారు.(చదవండి: రైతులకు విద్యుత్‌ ఎప్పటికీ ఉచితమే)

>
మరిన్ని వార్తలు