-

మాకు కష్టం వచ్చిన వెంటనే సీఎం జగన్‌ ఆదుకున్నారు

26 Nov, 2023 08:54 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మత్స్యకారులు

విశాఖలో సీఎం జగన్‌ చిత్రపటానికి మత్స్యకారుల క్షీరాభిషేకం

మహారాణిపేట: మత్స్యకారులకు కష్టం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌­రెడ్డి స్పందించి ఆదుకున్నారని ఆంధ్రప్రదేశ్‌ మెకనైజ్డెడ్‌ బోటు ఓనర్స్‌ అసోసి­యే­­షన్‌ అధ్య­క్షుడు వాసుపల్లి జానకీరామ్‌ చెప్పారు. విశాఖ­పట్నంలోని ఫిషింగ్‌ హార్బ­ర్‌లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తక్ష­ణమే స్పందించి బాధి­తులకు నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జానకీరామ్‌ ఆధ్వ­ర్యాన శనివారం విశాఖలో సీఎం వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి చిత్రపటానికి మత్స్యకా­రులు, బోటు యజమానులు క్షీరాభిషేకం చేశారు. జానకీరామ్‌ మాట్లాడుతూ మత్స్యకా­రులంటే సీఎం జగన్‌కు ఎనలేని అభిమాన­మని చెప్పా­రు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అతి తక్కువ సమ­యంలోనే బాధిత మత్స్య­కా­రులకు రూ.7.11 కోట్లు పరిహారం చెల్లించి సీఎం తన గొప్ప మనసును చాటుకు­న్నారని తెలిపారు.

మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథ­కాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అసోసి­యేషన్‌ నాయ­కులు మైల­పల్లి లక్ష్మణ­రావు, మైలపల్లి నర­సింహులు, జి.దానయ్య, దూడ పోలయ్య, గనగళ్ల పోతయ్య, మున్నం బాలాజీ, యాగ శ్రీనివాస­రావు, ఎస్‌.రాము, బోటు యాజమా­నులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొ­న్నా­రు.
చదవండి: పేదల సాధికారతపై ఉచిత పత్రిక ఉక్రోషం! 

మరిన్ని వార్తలు