Visakha Garjana: విశాఖ గర్జన గ్రాండ్‌ సక్సెస్‌

15 Oct, 2022 19:03 IST|Sakshi

Updates

విశాఖ గర్జనలో జన తుఫాన్‌

  • విశాఖ గర్జన గ్రాండ్‌ సక్సెస్‌
  • జనసంద్రమైన విశాఖ, ర్యాలీకి లక్షమందికి పైగా హాజరు

సభలో మంత్రి విడదల రజని మాట్లాడుతూ..

  • అందరూ బాగుండాలనే మా ఆలోచన
  • అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం
  • అమరావతి పాదయాత్ర చేస్తున్నది చంద్రబాబు బినామిలే: మేరుగ నాగార్జున
  • అందరూ అభివృద్ధి చెందాలంటే 3 రాజధానుల అవసరం: మేరుగ నాగార్జున

విశాఖ సభలో మంత్రి రోజా మాట్లాడుతూ..

  • మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేది జగనన్న సంకల్పం
  • దానికి ఉత్తరాంధ్ర ప్రజలంతా సంఘీభావం తెలపాలి
  • మీ జన సునామీలో చంద్రబాబు, పవన్‌లు కొట్టుకుపోవాలి
  • ఉత్తరాంధ్ర ప్రజలకు కోపం వస్తే ఎలా  ఉంటుందో చూపించండి
  • 2024... జగనన్న వన్స్‌మోర్‌
  • కలెక్షన్లు, షూటింగ్‌ల కోసం పవన్‌కు విశాఖ కావాలి
  • పోటీ చేయడానికి విశాఖ కావాలి
  • కానీ విశాఖలో రాజధాని వద్దా: మంత్రి రోజా
  • పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను సపోర్ట్‌ చేస్తున్న పవన్‌ను తరిమికొట్టాలి
  • ఉత్తరాంధ్ర ప్రజలు తొడగొడితే ఎలా ఉంటుందో పవన్‌కు చూపించాలి
  • అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానులు

స్పీకర్‌ తమ్మినేని మాట్లాడుతూ..

  • ఒకవైపు జడివాన.. మరో వైపు జనవాన
  • ఉత్తరాంధ్ర గర్జన ముందు బాబు గర్జన బలాదూర్‌
  • ఉత్తరాంధ్ర అన్ని రకాలుగా వివక్షకు గురైంది
  • భావితరాల కోసమే ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం

  • అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి బీచ్‌రోడ్డుకు చేరిన ర్యాలీ. 
  • నేతలు వైఎస్‌ఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. 
  • భారీ వర్షంలో రెండున్నర గంటలు సాగిన ర్యాలీ
  • దారి పొడవునా ర్యాలీకి విశాఖ ప్రజల సంఘీభావం. విశాఖకు రాజధాని రావాలంటూ హోరెత్తిన నినాదాలు.
  • జనసంద్రమైన విశాఖ, ర్యాలీకి లక్షమందికి పైగా హాజరు
  • విశాఖ పరిపాలనా రాజధాని అంటూ హోరెత్తిన నినాదాలు
  • మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ప్రజల నినాదాలు
  • 29 గ్రామాలు కాదు.. 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటూ నినాదాలు
  • అమరావతి పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు అంటూ హెచ్చరిక

  • చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి: మంత్రి ధర్మాన
  • ఉత్తరాంధ్ర కోసం అందరూ గొంతెత్తి నినదించాలి: మంత్రి ధర్మాన
  • ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు: మంత్రి ధర్మాన
  • ఉత్తరాంధ్ర కోసం రాజకీయ పోరాటం చేస్తాంఫ మంత్రి ధర్మాన
  • ప్రస్తుత పరిస్థితుల్లో వికేంద్రీకరణ చాలా అవసరం: బుగ్గన
  • అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ద్రోహి
  • అచ్చెన్నాయుడికి రాజకీయ సమాధి తప్పదు
  • చంద్రబాబుకు అచ్చెన్నాయుడు బానిస: దువ్వాడ శ్రీనివాస్‌

  • ఆ బానిసకు బుద్ధి చెప్పే సమయం వచ్చింది: ప్రొఫెసర్లు
  • ప్రపంచంలోని అద్భుత నగరాల్లో విశాఖ ఒకటి: ప్రొఫెసర్లు
  • విశాక రాధానిని ప్రజలంతా స్వాగతిస్తున్నారు: ప్రొఫెసర్లు
  • ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు ఇంకెన్నాళ్లు: ప్రొఫెసర్లు
  • ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే రాజధాని రావాలి

  • వర్షంలోనే కొనసాగుతున్న ‘విశాఖ గర్జన’ ర్యాలీ
  • భారీ వర్షంలోనే కొనసాగుతున్న ర్యాలీ
  • వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన ప్రజానీకం
     

మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ..

  • చంద్రబాబుకు 29 గ్రామాల అభివృద్ధే కావాలి
  •  మేం అందరి అభివృద్ధిని కోరుకుంటున్నాం
  • మేం చేసేది ప్రజా పోరాటం
  • చంద్రబాబు చేసేది రియల్‌ ఎస్టేట్‌ పోరాటం

విశాఖ గర్జనకు భారీ ప్రజా స్పందన

  • రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు
  • 3 రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి అంటూ ప్రజా సంఘాల నినాదాలు

కొడాలి నాని మాట్లాడుతూ..

  • ఉత్తరాంధ్ర వెనుకబాటను రూపుమాపేందుకే విశాఖ రాజధాని
  • ప్రజల ఆకాంక్షలకు అందరూ మద్దతు తెలుపుతున్నారు
  • అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం
  • ఆస్తుల సంపాదనే చంద్రబాబు ధ్యేయం
  • ఆ నలుగురి అభివృద్ధే చంద్రబాబుకు కావాలి
  • మహిళలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు

వికేంద్రీకరణే లక్ష్యంగా ప్రజా గళం..
వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. తమ ఆకాంక్షలను బలంగా చాటేందుకు నడుం బిగించారు. దీనిలో భాగంగా శనివారం  జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.  విశాఖ గర్జనకు విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు.

ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొంటున్నారు.  అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి పార్క్‌ హోటల్‌ వైఎస్సార్‌ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగుతోంది. రాజకీయాలకతీతంగా భారీ ప్రదర్శన చేపట్టగా దీనికి అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది.  ఈ మేరకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రకరణతోనే తమ ‍ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినదిస్తున్నారు.

‘టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర ఇప్పడు గుర్తుకువచ్చింది’
‘విశాఖ గర్జన భయంతో ఇప్పుడు టీడీపీ- జనసేనకు ఉత్తరాంధ్ర గుర్తుకు వచ్చింది. విశాఖ గర్జన విజయవంతం ఖాయం. విశాఖ రాజధాని అవకాశాన్ని వదులుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పష్టం చేశారు. ‘ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకే విశాఖ పరిపాలన రాజధాని. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞతతో ఒక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పరిపాల రాజధానిగా ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. విశాఖ గర్జనకు విశేషమైన స్పందన లభిస్తోంది’ అని మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు.

ఇక వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్న వారికి కనువిప్పు కలగాలని విశాఖ గర్జన ర్యాలీ. వర్షం వచ్చినా విశాఖ గర్జన ర్యాలీ ఆగదు.వర్షం కంటే ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మస్థైర్యం గొప్పది. ఉత్తరాంధ్రకు టిడిపి నాయకులు ఏం చేశారో సమాధానం చెప్పాలి.రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను టిడిపి నేతలు దోచుకున్నారు.జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఉత్తరాంధ్ర పై టిడిపి నేతలకు ప్రేమ పుట్టుకొచ్చింది’ అని పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు