ఘనంగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడి నిశ్చితార్థం 

21 Aug, 2022 20:54 IST|Sakshi
ఎంపీ ఎంవీవీ కుమారుడు శరత్‌ను ఆశీర్వదిస్తున్న  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి తదితరులు 

మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడు శరత్‌ చౌదరికి బెంగళూరుకు చెందిన పారిశ్రామిక వేత్త మేక సత్యనారాయణ కుమార్తె జ్ఞానితతో నిశ్చితార్థం శనివారం తాజ్‌ బెంగళూరులో ఘనంగా జరిగింది.
చదవండి: నాటుకోడికి ఫుల్‌ గిరాకీ.. ఆ రుచే వేరబ్బా.. ఎంత ఆరోగ్యమో తెలుసా..? 

ఈ వేడుకలో టీటీడీ చైర్మన్,ఉమ్మడి విశాఖ జిల్లా కో–ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి,విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని,ఎంపీలు మద్దిల గురుమూర్తి, సంజీవ్‌కుమార్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎ.అదీప్‌రాజ్, కె.శ్రీనివాసరావు,రాంరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్‌ కుమార్, ఎమ్మెల్సీ రఘరాజు, మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, సమన్వయకర్త కె.కె.రాజు, ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ఆశీర్వదించారు. డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి,వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆళ్ల శివగణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు