విశాఖ జిల్లాలో విషాదం, నది దాటుతూ ముగ్గురు మృతి

11 Jul, 2021 17:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం:  విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  బుచ్చయ్యపేట మండలం బంగారు మెట్ట సమీపంలో పెద్దేరు నది దాటుతూ ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఈ దారుణం జరిగింది. మృతులు వడ్డాది గ్రామస్తులని.. గిడ్ల రాము (45),కొళ్ళమల్ల శ్రీను (48),సికలా దారకొండ(60) గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం పొలం పనులకు దగ్గర దారిలో వెళ్లే క్రమంలో నది దాటుతూ ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు